Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారిలాగే నామార్కుతోనే తెర‌కెక్కించాః ద‌ర్శ‌కుడు విజయ్ కిరణ్ తిరుమల

Advertiesment
paisa paramatma
, గురువారం, 18 మార్చి 2021 (20:05 IST)
సాకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం `పైసా పరమాత్మ`. ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈనెల 12న విడుదలయి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల పత్రికలవారితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు.
 
- పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది.  సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మేము అనుకున్న ధియేటర్స్ కన్నా ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నటీనటులు అందరూ బాగా నటించారు. క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి ప్రతి పాత్రకు న్యాయం చేశారు. 
 
- `పూరి జగన్నాద్, త్రివిక్రమ్, కృష్ణ వంశీగారు వాళ్ళ మార్క్ ఏంటో క్రియేట్ చేసుకున్నారు. అలా నాకంటూ నా స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. క్యారెక్టర్స్ ఎలివేషన్ హైలెట్ గా చూపించడం జరిగింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్  స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను.  
 
- అలాగే నేను కృతజ్ఞతలు చెప్పుకునేవారు ఇద్దరు వ్యక్తులు వున్నారు. మా అమ్మా, నాన్న. ఇంకోటి మా గురువుగారు. వాళ్ళ వల్లే నేను ఇంత మంచి సినిమా తీయగలిగాను. సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ఈ సినిమా నాకు మంచి దర్శకుడిగా తృప్తినిచ్చింది.
 
- టైటిల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో సినిమాకి కూడా అంతే హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ఓటిటి లో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇక నుండి నేను చేయబోయే చిత్రాలు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా వున్నాయి.. ప్రాపర్ గా అవి బౌండ్ స్క్రిప్ట్స్ రెడీ చేసి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరపాలి. మా లక్ష్మి సుచిత్ర బ్యానర్ లో కొత్త కంటెంట్ వున్నా అన్ని జోనర్ మూవీస్ చేయాలనీ నిర్ణయించుకున్నాం. మంచి స్టార్ కాస్ట్ తో బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేయాలనీ దర్శకుడిగా నా గోల్. త్వరలో డి యమ్కే టైటిల్ తో ఒక పవర్ ఫుల్ కాఫ్ స్టోరీ తో సినిమా చేయబోతున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైస్ పుల్లింగ్‌తో రూ.26 కోట్ల మోసం.. జయచిత్ర కుమారుడు అరెస్టు!