Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#GopichandMalineniకు పుట్టినరోజు.. డాన్ శీనుగా వచ్చి క్రాక్ పుట్టించాడు..

Advertiesment
Director
, శనివారం, 13 మార్చి 2021 (10:49 IST)
Gopichand Malineni
తెలుగు సినిమా రచయిత, ప్రముఖ దర్శకుడు డాన్ శీను సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. డాన్ శీను. బాడీగార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గోపిచంద్.. నవతరం దర్శకుల్లో మాస్‌ను ఆకట్టుకొనే అంశాలను దట్టించి సినిమాను రక్తి కట్టించడంలో భళా అనిపించుకున్నాడు. 
 
ఈ యేడాది సంక్రాంతి బరిలో గోపీచంద్ తెరకెక్కించిన 'క్రాక్' సందడి పోటీ చిత్రాలకంటే మేటిగా సాగింది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ వంటి టాప్ హీరోతో సినిమా తెరకెక్కించే అవకాశాన్ని పట్టేశాడు గోపీచంద్. తీసింది పట్టుమని అరడజను సినిమాలే. అందులోనూ మూడు చిత్రాలు రవితేజతో తీశాడు గోపి.
 
వెంకటేశ్, రామ్, సాయిధరమ్ తేజ్ తో ఒక్కో సినిమా తెరకెక్కించాడు. గోపీచంద్ మలినేని సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, మాస్ ను కట్టిపడేసే అంశాలను భలేగా చొప్పించగలడు అనే పేరు సంపాదించాడు. గోపీచంద్ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని బొద్దులూరివారి పాళెంలో జన్మించాడు. స్వగ్రామంలో 10వ తరగతి వరకు చదువుకున్న గోపిచంద్, నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు.
 
శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన గోపిచంద్, శ్రీహరి నాలుగు సినిమాలకు పనిచేశాడు. అనంతరం ఇవివి సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు, శ్రీను వైట్ల దగ్గర అందరివాడు, వెంకీ, ఢీ సినిమాలకు, మురుగ దాస్ దగ్గర స్టాలిన్ సినిమాకు, శ్రీవాస్ దగ్గర లక్ష్యం సినిమాకు, మెహర్ రమేష్ దగ్గర కంత్రి, బిల్లా సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. డాన్ శీను ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు
 
ఇక రవితేజ -శ్రియ జంటగా 'డాన్ శీను' సినిమా తెరకెక్కిస్తూ దర్శకునిగా పరిచయమయ్యాడు గోపిచంద్. ఆ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం బెంగాల్ లో 'బాద్ షా ద డాన్'గా రీమేక్ అయింది. 
 
తాజాగా హీరో రవితేజతో 'క్రాక్' రూపొందించాడు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించింది. దాంతో గోపీచంద్ మలినేనికి క్రేజ్ కూడా పెరిగింది. 'క్రాక్'తో గోపీచంద్ సాధించిన విజయానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించి, ఆయనను అభినందించారు. 
 
బాలకృష్ణ వంటి టాప్ స్టార్‌తో  సినిమా తీసే అవకాశం ఇప్పుడు గోపీచంద్ సొంతమైంది. ఇంకేముంది.. గోపిచంద్ మరిన్ని హిట్ సినిమాలకు దర్శకుడిగా మారాలని మనమూ ఆశిద్దాం.. హ్యాపీ బర్త్ డే గోపిచంద్ మలినేని గారూ..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా టాలీవుడ్ నటి మెహ్రీన్ నిశ్చితార్థం