Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ‌య‌ట‌కు వ‌చ్చినా వెంటాడే సినిమా శ్రీకారం: గోపీచంద్ మ‌లినేని

బ‌య‌ట‌కు వ‌చ్చినా వెంటాడే సినిమా  శ్రీకారం: గోపీచంద్ మ‌లినేని
, శుక్రవారం, 12 మార్చి 2021 (19:33 IST)
Sreekaram Movie Success
‘శ్రీకారం సినిమా చూడ‌గానే ద‌ర్శ‌కుడు కిషోర్‌ని చూస్తే చాలా ముచ్చ‌టేసింది. త‌ను చెప్పాల‌నుకున్న పాయింట్‌ను జెన్యూన్‌గా చెప్పాడు. నేను అప్పుడ‌ప్పుడు సంక్రాంతికి ఇంటికెళ్లిన‌ప్పుడు టౌన్ నుంచి వాళ్ల పిల్ల‌లు వ‌స్తార‌ని త‌ల్లిదండ్రులు ఎదురుచూస్తుండ‌టాన్ని గ‌మ‌నించాను. కాబ‌ట్టి ఈ సినిమా ఇంకా ఎక్కువ క‌నెక్ట్ అయ్యింది. శ‌ర్వానంద్ సెటిల్డ్‌గా పెర్ఫామ్ చేశాడు. మ‌న‌లో తొంబై శాతం మంది ప‌ల్లెటూర్ల నుంచి వచ్చిన‌వాళ్లే. కాబ‌ట్టి వాళ్ల క‌ష్ట‌న‌ష్టాల‌ను కిషోర్ చ‌క్క‌గా చిత్రీక‌రించాడు. సాయిమాధ‌వ్‌గారు జీవితాన్ని చూశారు, చ‌దివారు కాబ‌ట్టే ఇంత గొప్ప‌గా మాట‌ల‌ను రాయ‌గ‌లిగారు.

కొన్ని సినిమాలోని పాత్ర‌లు థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మ‌నల్ని హాంట్ చేస్తుంటాయి. అలాంటి సినిమా శ్రీకారం. నిర్మాత‌లు రామ్‌గారు, గోపీగారు.. నేను డైరెక్ట‌ర్ కాక‌ముందు నుంచి తెలుసు. ఈ సినిమా కోసం న‌ల‌బై ఎక‌రాల్లో తిరుప‌తి ద‌గ్గ‌రున్న వ్య‌వ‌సాయ భూమి తీసుకుని వ్య‌వసాయం చేసి నిజంగానే పంట‌లు పండించారు. అంటే.. నిర్మాత‌ల ప్యాష‌న్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. వాళ్లు ఇంకా చాలా మంచి సినిమాలెన్నింటినో నిర్మించాలి. సాయికుమార్‌గారు వెర్స‌టైల్ యాక్ట‌ర్‌. మ‌రోసారి మంచి పాత్ర‌లో క‌నిపించారు. మిక్కీ సాంగ్స్‌, నేప‌థ్య సంగీతం ప్రేక్ష‌కుల్ని సినిమాలో లీన‌మ‌య్యేలా చేసింది. యువ‌రాజ్ విజువ‌ల్స్ నేచుర‌ల్‌గా ఉన్నాయి. ప్రేక్ష‌కుల స‌పోర్ట్‌తో ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్‌కు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అని డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని అన్నారు.
 
శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్.బి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ ఆచంట‌, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 11న విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్‌లో డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని మాట్లాడారు. ఇంకా ప‌లువురు ప్ర‌ముఖులు మాట్లాడారు.
 
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ - ‘‘మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 11న మా శ్రీకారం సినిమా విడుద‌లై శ‌ర్వానంద్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది. ఈ ట్రెమెండ‌స్ రెస్పాన్స్ రావ‌డం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచి చాలా అప్రిషియేష‌న్స్ కాల్స్ వ‌చ్చాయి. ఇంత మంచి సినిమాలో భాగ‌మైనందుకు గ‌ర్వంగా ఉంది. హ్యుమ‌న్ వేల్యూస్‌, ఎమోష‌న్స్‌ను ద‌ర్శ‌కుడు కిషోర్ తెర‌పై చాలా నేచుర‌ల్‌గా చూపించాడు. మంచి సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు డె‌ఫినెట్‌గా ఆద‌రిస్తార‌ని మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. ఫ్యామిలీ స‌బ్జెక్ట్ కాబ‌ట్టి ఇంకా మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని న‌మ్మ‌కం ఉంది. ఇంత మంచి సినిమా చూసి చాలా కాల‌మైంద‌ని అభినందిస్తున్నారు. వారిలో గోపీచంద్ మ‌లినేని, బాబీ, అజ‌య్ భూప‌తి వంటి వారు ఉన్నారు. వారు మా సినిమాకు స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు రావ‌డం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు.
 
రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ - ‘‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పిన‌ట్లు సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ తృప్తిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాళ్లు చూడ‌ట‌మే కాదు.. వాళ్ల త‌ల్లిదండ్రుల‌ను కూడా తీసుకెళుతున్నారు. అప్పుడే సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో తెలిసింది. చాలా గొప్ప సినిమాకు ప‌నిచేశామ‌ని గ‌ర్వంగా ఉంది. ద‌ర్శ‌కుడు కిషోర్‌ను ఎంత పొగిడినా త‌ప్పు లేదు. చాలా క‌ష్ట‌ప‌డి మంచి సినిమాను తెర‌కెక్కించాడు. నిర్మాత‌లు ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఇది సందేశాన్నిచ్చేసినిమా కాదు.. సంతోషాన్నిచ్చే సినిమా’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ బి.కిషోర్ మాట్లాడుతూ - ‘‘ఈ క‌థ రాసుకున్న‌ప్ప‌టి నుంచి డెఫ‌నెట్‌గా కొన్ని సీన్స్ వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని అనుకున్నాం. ఆ సీన్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆడియెన్స్ అయితే ట్రాక్ట‌ర్స్ క‌ట్టుకుని మ‌రీ సినిమాకు వెళుతున్నారు.కేటీఆర్‌గారు, చిరంజీవిగారు రిలీజ్‌కు ముందు స‌పోర్ట్ చేస్తే.. రిలీజ్ త‌ర్వాత డైరెక్ట‌ర్స్ గోపీచంద్ మ‌లినేని, బాబీ, అజ‌య్ భూప‌తి సినిమాకు స‌పోర్ట్ చేస్తున్నారు. వారంద‌రికీ థ్యాంక్యూ వెరీ మ‌చ్‌’’ అన్నారు.
 
సాయికుమార్ మాట్లాడుతూ - ‘‘డైరెక్టర్ కిషోర్ ఈ క‌థ‌ను నెరేట్ చేశాడు. త‌ర్వాత ఏ క్యారెక్ట‌ర్ చేస్తున్నానో అడిగిన‌ప్పుడు ..ఏకాంబ‌రం క్యారెక్ట‌ర్ చేయాల‌ని చెప్పాడు కిషోర్‌. ఆ పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఓస్టూడెంట్‌లా ఆ పాత్ర చేసి కొన్ని విష‌యాల‌ను నేర్చుకున్నాను. రామ్‌, గోపీ ఆచంట‌లు చాలా డేడికేటెడ్ ప్రొడ్యూస‌ర్స్‌. సినిమాపై ప్యాష‌న్ ఉన్న‌వాళ్లు కాబ‌ట్టి ఇంత మంచి సినిమా తీశారు. ప్ర‌తి ఆర్టిస్ట్ ఇన్‌వాల్వ్ అయ్యి న‌టించారు. మంచి క‌థప‌డితే ప్ర‌తి ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతాడ‌నికి ఈ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ - ‘‘రాత్రి సినిమా చూశాను. కిషోర్ 2016లోనే శ్రీకారం సినిమా షార్ట్ ఫిలింగా తీశాడు. దాన్నే ఇప్పుడు ఫీచ‌ర్ ఫిలింగా మ‌లిచాడు. తొలి సినిమాకే ఇలాంటి స్టోరి ఎంచుకోవ‌డం గొప్ప విష‌యం. నేను ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి సినిమాకు వెంట‌నే క‌నెక్ట్ అయ్యాను. శ‌ర్వాగారు ఎక్స‌లెంట్‌గా పెర్ఫామ్ చేశారు. యూత్ తప్ప‌కుండా చూడాల్సిన సినిమా’’ అన్నారు.
 
హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహ‌న్ మాట్లాడుతూ - ‘‘‘శ్రీకారం’ సినిమాను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. త‌ప్ప‌కుండా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా. అంద‌రూ చూడాల్సిన సినిమా’’ అన్నారు. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ - ‘‘శ్రీకారం ఓ హానెస్ట్ మూవీ. మౌత్ టాక్‌తో ముందుకు తీసుకెళ్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. నిన్న నా స్నేహితుడొక‌రు ఫోన్ చేసి, శ్రీకారం సినిమా చాలా బావుంది. చూస్తుంటే క‌న్నీళ్లు వ‌స్తున్నాయి. రాత్రి నేను కూడా సినిమా చూశాను. కిషోర్ ప్ర‌తి సీన్‌ను నిజాయ‌తీగా చెప్పాడు. ఇంత మంచి సినిమాను నిర్మించిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌. సాయిమాధ‌వ్‌గారు మాట‌ల‌తో యుద్ధ‌మే చేశాడు. శ‌ర్వా గొప్ప న‌టుడు, త‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మా..త్' అంటూ బూతులు మాట్లాడేసిన నాగార్జున.. వైల్డ్ డాగ్ ట్రైలర్ అదుర్స్