Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాగా సామాన్యుడి జీవిత కథ!

సినిమాగా సామాన్యుడి జీవిత కథ!
, సోమవారం, 15 మార్చి 2021 (17:37 IST)
Murali, Manuyazna
సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్‌లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ. ప్రస్తుతం హీరో సుమంత్‌తో `అనగనగా ఒక రౌడీ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ. 
 
ఆయన  ఈ చిత్ర విశేషాలను తెలియజేస్తూ,  ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు. అటువంటి వ్య‌క్తి ఒక సమయంలో రియలైజ్ అయ్యి మారిపోతాడు. అలా మారి ఒక సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడు. ఇలా సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి నలుగురికి ఎలా ఆదర్శప్రాయంగా నిలిచాడు అనేది కథ. ఇది మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితగాథ‌. ఆయ‌న జీవితంలో జ‌రిగిన యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేఎమ్ రాజీవ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం మెగాస్టార్ నుంచి హీరోలు వస్తారా..? నందమూరి కొత్త హీరో రెడీ..?!