Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు హీరో నితిన్ వివాహం వాయిదా

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (14:48 IST)
కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. చివరకు వివవాహాలను కూడా వాయిదా వేయిస్తోంది. తాజాగా ఈ కరోనా వైరస్ దెబ్బకు టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ నితిన్ వివాహం కూడా వాయిదాపడింది. 
 
నితిన్ వివాహం వచ్చే నెల 16వ తేదీన దుబాయ్‌లో గ్రాండ్‌గా జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ దెబ్బకు దుబాయ్ అతలాకుతలమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా దుబాయ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. 
 
దీంతో దుబాయ్‌లో జరగాల్సిన నితిన్ వివాహం కూడా వాయిదాపడినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో విదేశీయులను పలు దేశాలు నిషేధిస్తుండటంతో, తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని నితిన్ నిర్ణయించుకున్నారని సమాచారం.
 
ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు కాగా, వచ్చే నెల 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, ఆపై 16వ తేదీన రిసెప్షన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. దుబాయ్‌ని కూడా కరోనా పట్టి పీడిస్తుండటంతో వివాహాన్ని వాయిదా వేసుకునేందుకే నితిన్ మొగ్గు చూపుతోంది. 
 
మరోవైపు, హైదరాబాద్‌లో వివాహం చేసుకోవాలని కొందరు బంధుమిత్రులు సలహా ఇస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ వివాహం రద్దుపై నితిన్ ఫ్యామిలీ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments