Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతగా వస్తున్న కృష్ణుడు

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:09 IST)
‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ప్రచార చిత్రాలు విడుదల చేయనున్నారు.
 
ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ... ‘‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ఉంటుంది. కొత్త కథ, కథనాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది.
 
తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments