Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళి సర్... గుడ్లు తినండి.. విశ్రాంతి తీసుకోండి.. హాయిగా నిద్రపోండి (video)

రాజమౌళి సర్... గుడ్లు తినండి.. విశ్రాంతి తీసుకోండి.. హాయిగా నిద్రపోండి (video)
, గురువారం, 30 జులై 2020 (13:55 IST)
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. పైగా, ఈ వార్త విన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలనే సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'హ్యాపీగా ఉండండి సర్. ఏమీ కాదు. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. విశ్రాంతి తీసుకోండి. హాయిగా నిద్రపోండి' అని సూచించారు. తన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజమౌళికి గణేశ్ సూచనలు చేశారు.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అలా రాజమౌళి కూడా కరోనా వైరస్‌కు చిక్కారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని చెప్పారు. 
 
జ్వరం తగ్గిపోయిందని... అయినప్పటికీ తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని... తమకు స్వల్ప స్థాయిలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నామని చెప్పారు. 
 
ఇప్పుడు బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీబాడీలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని... ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తామని తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంగోపాల్ వర్మకు షాక్, జీహెచ్ఎంసీ రూ. 88,000 జరిమానా