ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాదు మహానగర పురపాలక సంస్థ (జీహెచ్ ఎంసీ)మరోసారి జరిమానా విధించింది. పురపాలక సంస్థ నిబంధనలను పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అంటించినందుకు వర్మకు బుధవారం నాడు రూ.88వేలు చెల్లించాలని ఇ-చలానా జారీ చేసింది.
ఆర్జీవీ నిర్మించిన పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాలలో అంటించారు. జులై 21న జబ్లీహిల్స్‌లో పోస్టర్లు అంటించారని ఒకరు ట్విట్టర్ ద్వారా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసారు. దీంతో సదరు రెండు పోస్టర్లకు నాలుగు వేల రూపాయలు జరిమానా విధించారు.
అయితే అదే ప్రాంతంలో దాదాపు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతి తీసుకోక పోవడంతో రూ.88 వేలు జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.