Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (18:10 IST)
సినీ నటి హన్సిక మొత్వానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలంటూ ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు గతంలో నమోదైన విషయం తెల్సిందే. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ ఎస్ఎం మోదక్‌లతో కూడిన ధర్మాసనం హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ మూడో తేదీకి వాయిదా వేసింది. 
 
హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ టీవీ నటి ముస్కాన్ జేమ్స్‌ను గత 2020లో వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల వారు 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో గత ఫిబ్రవరి నెలలో హన్సిక, జ్యోతిలకు ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments