Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ కనకాల కేరళ ఎప్పుడెళ్లాడు? యాంకర్ సుమపై అలీ మరోసారి కాట్రవల్లీ..

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:56 IST)
కొన్ని రోజులుగా ఏ వేడుక‌లో కూడా నోరు జార‌ని అలీ.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ త‌న నోటికి ప‌ని చెప్పాడు. తాజాగా ల‌వ‌ర్స్ డే ప్రీ రిలీజ్ వేడుక‌లో మ‌రోసారి అనుచిత వ్యాఖ్య‌లు చేసాడు ఈ క‌మెడియ‌న్. ఇప్పుడు ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. మ‌రోసారి సుమపైనే ఇలాంటి క‌మెంట్స్ చేసాడు ఈయ‌న‌.
 
ప్రీ రిలీజ్ వేడుక‌లో అలీ త‌న‌కు నోటికొచ్చిన కాట్ర‌వ‌ల్లీ భాష మాట్లాడి.. దాన్ని సుమ తెలుగులో అనువాదం చేస్తుందంటూ చెప్పాడు. దానికి వెంట‌నే సుమ ఇంతే క‌దా.. మీరు చెప్పండి నేను డ‌బ్బింగ్ చెప్తానంది. అలీ చెప్పిన దానికి సుమ వెంట‌నే ఇక్క‌డున్న వాళ్లంద‌రికీ ప్రియా వారియ‌ర్ చెల్లెలు అవుతుంద‌ని అలీ చెబుతున్నార‌ని.. అలీకి కూడా ప్రియా చెల్లే అవుతుంద‌ని చెప్పింది. 
దానికి వెంట‌నే అలీ ఊరుకోకుండా మ‌రి హీరో రోష‌న్ మీకు ఏమ‌వుతాడు.. కొడుకు అవుతాడా అని అడిగాడు. దానికి సమాధానం చెప్తూ అవును రోష‌న్ నా కొడుకు అవుతాడంటూ చెప్పింది సుమ‌. 
 
వెంట‌నే అలీ ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా మ‌రి రాజీవ్ కనకాల కేర‌ళ ఎప్పుడు వెళ్లాడు.. అంటూ ఓ భారీ డ‌బుల్ మీనింగ్ డైలాగ్ వ‌దిలేసాడు. అక్క‌డే ఉన్న హీరోకు తెలుగు రాదు కాబ‌ట్టి పెద్ద‌గా ఆయ‌న మొహంలో ఎలాంటి రియాక్ష‌న్ రాలేదు.. కానీ కింద ఉన్న వాళ్లు మాత్రం ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేసారు. అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు.
 
వెంట‌నే తేరుకున్న సుమ‌.. అలీ గారు అస‌లు మీ నోట్లో నోరు పెట్టాను చూడండి.. అంటూ చెంప‌లేసుకుంది. మొత్తానికి స‌ర‌దాగా అన్నా కూడా ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments