కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగి చివరకు వైసీపీ మద్దతు మాత్రమే పొందగలిగారనే విషయం అర్థమయిందన్నారు విజయశాంతి. కేసీఆర్ గారిని కలిసిన మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, ఎం.కె.స్టాలిన్ వంటి నేతలు కోల్‌కతాలో జరిగిన మహాకూటమి సభకు హాజరై బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కి మద్దతు పలికారు.
అంటే... టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుందేమో. ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఏర్పడబోయే ఫ్రంట్‌ను ఫెడరల్ ఫ్రంట్ అనడం కంటే ఫెడప్ ఫ్రంట్ అనాలన్నారు విజయశాంతి.