సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అనే పేరు విపరీతంగా గుర్తింపు పొందింది. హీరోగా ఎన్నో హిట్‌లను అందించిన అతను తన ప్రతిభను ప్రదర్శించి సినీ ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని నెలకొల్పాడు. అర్జున్ సర్జా తన సినిమా కెరీర్‌కు మించి ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఆయన సేవలను గుర్తించిన ఎంజీఆర్ యూనివర్సిటీ నిన్న గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రొఫెసర్లు హాజరై అర్జున్ సర్జాను ఘనంగా సత్కరించారు.