Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంతారా చాప్టర్- 1 కోసం కేరళ యుద్ధ కళ కలరిపయట్టులో శిక్షణ తీసుకున్న రిషబ్ శెట్టి

Advertiesment
Kantara Chapter-1

డీవీ

, సోమవారం, 18 నవంబరు 2024 (09:16 IST)
Kantara Chapter-1
ఇటీవల కాలంలో ప్రపంచ ఆడియన్స్ మనసు దోచుకున్న కాంతారా సిరీస్ నుంచి ఇప్పుడు కాంతారా చాప్టర్- 1 రాబోతోంది. ఈ కన్నడ సినిమా కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతారా చాప్టర్- 1 చిత్రాన్ని అక్టోబర్ 2, 2025న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. పాన్ ఇండియా సినిమాగా మరోసారి ప్రపంచాన్ని ఆకర్షించేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది.  
 
భారీ నిర్మాణ విలువలతో ఆడియన్స్ మెచ్చే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హోంబలే ఫిల్మ్స్.. కాంతారా చాప్టర్- 1 అనే మరో కళాఖండాన్ని రూపొందించడానికి ఎంతో సాహసం చేసింది. ఈ నిర్మాణ బృందం కుందాపూర్‌లో చారిత్రాత్మక కదంబ సామ్రాజ్యాన్ని పునఃసృష్టి చేసింది. శౌర్యం, సంస్కృతి, ఆధ్యాత్మిక యుగం వీక్షకులకు కళ్లకు కట్టినట్లు కనిపించేలా సెట్టింగ్స్ చేసింది. ఈ క్లిష్టమైన సెట్, వివరణాత్మక ఆర్కిటెక్చర్, లైఫ్‌లైక్ పరిసరాలతో పూర్తి చేయబడింది. ఇది ప్రేక్షక లోకాన్ని గత కాలంలోకి తీసుకెళ్లి వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని మేకర్స్ అంటున్నారు.
 
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహిస్తున్న నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత్ర కోసం ఎంతో శ్రమించారు. తన పాత్రలో రియాలిటీ ఉట్టిపడేలా కష్టపడ్డారు.  కేరళ నుండి ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో రిషబ్ కఠినమైన శిక్షణ పొందారు. కళలో ప్రావీణ్యం సంపాదించడానికి అంకితభావంతో పని చేసి తన పాత్ర, సంప్రదాయానికి మచ్చుతునకలా నిలిచేలా చేశారు. సినిమాలో ఈ రోల్ హైలైట్ కానుందట.
 
కాంతారా చాప్టర్- 1 కొంకణ్ జానపద గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయనుంది. గ్రిప్పింగ్ కథనం, ఉత్కంఠభరితమైన విజువల్స్ తో ఈ చిత్రం భారతదేశ సరిహద్దులను దాటి ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంది. ఇప్పటికే వచ్చిన కాంతారా మూవీ స్థానిక సంప్రదాయాల యొక్క ప్రామాణికమైన వర్ణన, స్టోరీ టెల్లింగ్ తో స్లీపర్ హిట్‌గా మారింది. ఈ ఫ్రాంచైజీకి ప్రపంచ స్థాయి అభిమానులను సొంతం చేసింది.
 
ఈ క్రమంలోనే తాజాగా నిర్మాతలు కాంతారా చాప్టర్- 1 విడుదల తేదీని ప్రకటించడంతో ఈ సినిమాపై మరింత ఉత్కంఠ నెలకొంది. హోంబాలే దృష్టి, రిషబ్ శెట్టి అంకితభావం.. కాంతారా చిత్రం వారసత్వంతో, ఈ చిత్రం సినీ చరిత్రలో మరో మైలురాయి అవుతుందనే టాక్ మొదలైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పుష్ప-2' ట్రైలర్ లాంచ్.. చెప్పులు విసురుకున్న ఫ్యాన్స్.. లాఠీలకు పని...