Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్యలో చెర్రీ సరసన పూజా హెగ్డే... ఆర్ఆర్ఆర్ 2021, అక్టోబర్ 8న విడుదల

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:39 IST)
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే మూవీతో పాటు ఆచార్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు ప్రాత్ర పోషిస్తుండగా, ఆయన సరసన కథానాయికగా అలియా భట్ నటిస్తుంది. ఇక చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు చరణ్‌. 
 
ఇందులో మెగాపవర్ స్టార్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఓ సాంగ్ కూడా ఉందని ప్రచారం నడుస్తుంది. సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తుండగా, ఇటీవల ఆయన పాత్రకు సంబంధించి ప్రీ లుక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఇప్పటికే విడుదలైన `భీమ్ ఫర్ రామరాజు`, `రామరాజు ఫర్ భీమ్` వీడియోలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.
 
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ పొరపాటున చిత్ర విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. `ఆర్ఆర్ఆర్` సినిమా 2021, అక్టోబర్ 8న విడుదల కాబోతున్నట్టు అలిసన్ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిందట. ఇది వైరల్ కావడంతో కొద్ది సేపటికే ఆమె తన పోస్టును డిలీట్ చేసింది. ఈ లోపే ఆమె పోస్టును చూసిన చాలా మంది `ఆర్ఆర్ఆర్` విడుదల తేదీ ఇదే అంటే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments