Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిర్ ఖాన్ మూడో పెళ్లికి మొగ్గా? మిస్టర్ పర్ఫెక్ట్ స్పందన ఏంటి?

ఠాగూర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (17:10 IST)
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా గుర్తింపు పొందిన అగ్రహీరో అమిర్ ఖాన్ మూడో పెళ్లి అంశంపై స్పందించారు. ఆయన తాజాగా నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న ఓ షోలో పాల్గొన్నారూ. ఇందులో ఆయన వైవాహిక జీవితం, మూడో పెళ్ళి తదితర అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
 
తాను విడాకులు తీసుకున్నప్పటికీ తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్ రావుతో మంచి అనుబంధమే ఉందన్నారు. వారు ఇప్పటికీ తన కుటుంబంలో భాగమేనని చెప్పుకొచ్చారు. అలాగే వివాహ జీవితంలో రెండు సార్లు ఫెయిల్ అయిన తన నుంచి వైవాహిక సూచనలు తీసుకోకపోవడం మంచిదన్నారు. 
 
తనకు ఒంటరిగా జీవించడం ఇష్టముండదని చెప్పిన అమిర్.. తనకు ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ఇక జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కనుక వివాహ బంధం సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పలేమన్నారు. 
 
ఈ క్రమంలో మూడో పెళ్లి ఆలోచన ఉందా అని రియా అడిగారు. దీనికి సమాధానంగా, '59 ఏళ్ల వయసులో వివాహం అంటే కష్టం. నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రస్తుతం నాకెంతో ఇష్టమైన వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. నా ఫ్యామిలీ, పిల్లలు, మిత్రులతో రీ కనెక్ట్ అయ్యా' అని అమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు
 
కాగా, అమిర్ ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని విడాకులు తీసుకున్నారు. 1986లో మొదట రీనాదత్తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంట 2002లో వీడిపోయింది. ఆ తర్వాత "లగాన్" మూవీకి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసిన కిరణ్ రావుతో అమిర్‌కు పరిచయం ఏర్పడి అది పెళ్లివరకు దారితీసింది. వీరిద్దరూ 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, అనూహ్యంగా 2021లో 16 ఏళ్ల వైవాహిక బంధానికి ఈ జంట ముగింపు పలకడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments