Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ తంగలాన్

డీవీ
సోమవారం, 26 ఆగస్టు 2024 (16:38 IST)
Thangalan, Malavika
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా "తంగలాన్" ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. చియాన్ విక్రమ్ కెరీర్ లో 26 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా "తంగలాన్" సినిమా సెకండ్ వీక్ లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ అంతటా స్ట్రాంగ్ హోల్డ్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ కు రీచ్ కానుంది. ఈ నెల 30న నార్త్ లో "తంగలాన్" రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
రెండో వారంలో "తంగలాన్" సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. "తంగలాన్" చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments