నిర్మాత బ‌న్నీ వాసు మోసం చేశాడంటూ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Webdunia
గురువారం, 15 జులై 2021 (11:45 IST)
సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది. తాను ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్దకు వచ్చిన సునీత బోయ అనే మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
మ‌ల‌క్ పేట ప్రాంతంలో కొంత కాలంగా పుచ్చకాయలు విక్రయిస్తున్న సునీత బోయకు గతంలో సినీ పరిశ్రమతో కొంత సంబంధాలు ఉండేవి. బన్నీ వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ మోసం చేశాడని ఆమె చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు, ఆయన సంబంధీకులు ఇప్పటికే నాలుగు సార్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు.

రెండుసార్లు ఎర్రగడ్డలోని ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. తాజాగా వారం కిందట ఆమె మరో వీడియో పోస్టు చేశారు. బన్నీ వాసు బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆ వీడియోలో ఆమె పోస్టు చేశారు.

ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందుకు వచ్చిన సునీత బోయను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కార్యాలయం మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. అలాగే ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక చికిత్సాలయానికి తరలించాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు న్యాయమూర్తిని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి - మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments