Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోమాలు నిక్కబొడుచుకునేలా రౌద్రం రణం రుధిరం (Making Video)

Webdunia
గురువారం, 15 జులై 2021 (11:30 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "రౌద్రం రణం రుధిరం" (ఆర్ఆర్ఆర్). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం సినీ ప్రేక్ష‌కులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. 
 
క‌రోనా వ‌ల‌న ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ మొద‌లు పెట్టారు. కొద్ది సేప‌టి క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. 
 
ఈ వీడియో చూస్తేంటే 'ఆర్ఆర్ఆర్' చిత్రం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చందాన తెర‌కెక్కిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. హాలీవుడ్ రేంజ్‌లో జక్క‌న్న స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో ఎన్టీఆర్, రాజ‌మౌళి అద‌రగొట్టారు. 
 
ఈ వీడియోని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ టీం అభిమానుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌.. అల్లూరి సీతారామ‌రాజుగా కనిపిస్తుండ‌గా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. 
 
ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా మోరిస్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భట్ న‌టించింది. అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments