Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలుకు జానీ మాస్టర్... ఎందుకు?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (15:14 IST)
తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్ర‌ాఫ‌ర్స్‌లో జానీ మాస్ట‌ర్ కూడా ఒక‌రు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోల‌కు కూడా ఈయ‌న కొరియోగ్ర‌ఫీ చేసారు. ఇప్ప‌టివ‌ర‌కు వంద‌ల పాట‌ల‌కు డాన్స్ స్టెప్స్ వేయించిన ఈయ‌న ఇప్పుడు జైలుకు స్టెప్స్ వేస్తున్నాడు.
 
ఓ ఛీటింగ్ కేసులో ఈయ‌న ఇరుక్కున్నాడు. ఇప్పుడు జైలుకు కూడా వెళ్లాడు జానీ. ఈయ‌న‌తో పాటు మ‌రో ఐదుగురిని కూడా జైలుకు త‌ర‌లించాల‌ని మేడ్చ‌ల్ కోర్ట్ ఆదేశించింది. ఈయ‌న‌పై నాలుగేళ్ల కింద ఈ కేసులు న‌మోద‌య్యాయి. 2015 సంవత్సరంలో సెక్ష‌న్ 354, 324, 506 కింద జానీ మాస్ట‌ర్ పై కేసు నమోదు చేయగా.. ఇన్నాళ్ల‌కు దీనిపై తీర్పు వ‌చ్చింది. 
 
సెక్ష‌న్ 354 కేసుని కొట్టివేసి.. 324, 506 సెక్ష‌న్స్ మాత్రం నిజ‌మే అని నిర్థారించింది కోర్ట్. దాంతో ఈయ‌న‌కు 6 నెలల శిక్ష విధించింది. జానీ మాస్టర్‌తో పాటు మరో 5 మంది కుడా జైలుకు వెళ్లారు. అయితే ఈయ‌న చెక్ బౌన్స్ కేసుతో పాటు మ‌రిన్ని కేసుల విష‌యంలో నిందితుడిగా తేలింది. 
 
ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపర్చటం.. హ‌త్యాయ‌త్నం చేయ‌డం వంటి చర్యలు ఈ సెక్షన్ల కిందకి వస్తాయి. కానీ ఇందులో 354 సెక్షన్ కింద కూడా కేసు న‌మోదు కావ‌డం.. దాన్ని కోర్ట్ త‌ప్పు అని నిర్ధారించ‌డం జ‌రిగింది. ఇక మిగిలిన 324, 506 సెక్షన్ల కింద నేరం రుజువు కావ‌డంతో 6 నెలల జైలుశిక్ష విధించింది మేడ్చల్ కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

Lokesh: జగన్ గారికి మొబైల్ కొనిపెట్టండి.. నా జేబులో నుండి 10 కోట్లు ఇస్తాను: నారా లోకేష్

తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్: కీలక మార్గదర్శకాలు విడుదల- విద్యార్థులు పరీక్షా హాలులోకి?

WhatsApp : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 సేవలను అందిస్తాం.. నారా లోకేష్

NVIDIAలో రూ.3 కోట్ల వార్షిక జీతం ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన హైదరాబాద్ అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments