Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్న ముఖేష్‌ను కౌగిలించుకుని కన్నీళ్ళ పెట్టుకున్న అనిల్ అంబానీ...!

అన్న ముఖేష్‌ను కౌగిలించుకుని కన్నీళ్ళ పెట్టుకున్న అనిల్ అంబానీ...!
, మంగళవారం, 19 మార్చి 2019 (21:25 IST)
ఎంతైనా రక్తసంబంధం. తోడబుట్టిన వాడు కష్టాల్లో చూస్తూ ఊరుకుంటాడా. తమ్ముడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. జైలుకు వెళ్ళే పరిస్థితి రాకుండా సాయపడ్డాడు. ముఖేష్ అంబానీ చెల్లించాల్సిన 550కోట్ల రూపాయలు తానే ఇచ్చాడు. అన్నా..వదినలు ఇచ్చిన సాయానికి ఉద్వేగానికి లోనయ్యాడు అనిల్ అంబానీ.
 
అనిల్ అంబానీ.. ముఖేష్ అంబానీ ఇద్దరు తండ్రి వ్యాపార వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవారే. అయితే ముఖేష్ అంబానీకి మాత్రం పట్టిందల్లా బంగారంలా మారి ప్రపంచంలో కుబేరుడిగా ఎదిగితే ఏది మొదలుపెట్టినా ముందడుగు పడక తీవ్ర నష్టాల్లో పడ్డాడు అనిల్ అంబానీ. తండ్రి మరణం తరువాత అన్నదమ్ముల మధ్య మనస్పర్థల కారణంగా ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటున్నారు. అయితే అనిల్ కు కాలం కలిసి రాలేదు.
 
ఎరిక్సన్ కంపెనీకి అనిల్ అంబానీ 550కోట్లు బాకీ పడ్డారు. అనిల్ గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాకీ చెల్లించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినా అనిల్ రియాక్ట్ కాలేదు. దీంతో సుప్రీం సీరియస్ అయ్యింది. 550కోట్లు చెల్లించకుంటే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది. మార్చి 19వతేదీ వరకు డెడ్ లైన్ పెట్టింది. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనిల్ కు అంత డబ్బు చెల్లించలేని పరిస్థితి
 
చేసేది ఏమీ లేక జైలుకు వెళ్ళడానికి కూడా మానసికంగా సిద్థపడ్డాడు. దీంతో ముఖేష్ అంబానీ రంగంలోకి దిగాడు. తమ్ముడు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. మొత్తం డబ్బులను డెడ్ లైన్ కంటే ముందే చెల్లించేశాడు. దీంతో అనిల్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్న తనపై చూపించిన ప్రేమకు మురిసిపోయాడు. భావోద్వేగానికి లోనై అన్నను కౌగిలించుకున్నాడు. అన్న చెప్పినట్లే ఇక నుంచి వ్యాపారం చేస్తానని చెబుతున్నారు అనిల్ అంబానీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జడ్జి ముందే భార్యను కత్తితో పొడిచేశాడు...