Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనిల్ అంబానీకి పేపర్ ప్లేన్‌ను కూడా తయారుచేయడం చేతరాదు : రాహుల్

Advertiesment
Rahul Gandhi
, బుధవారం, 13 మార్చి 2019 (10:00 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. దేశంలో ద్వేషాన్ని నింపారనీ, వ్యవస్థలను ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం మంగళవారం ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో నిర్వహించారు. ఈ సమావేశం పార్టీ అగ్ర నేతలు రాహుల్‌, సోనియా గాంధీ అధ్యక్షతన అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ మెమోరియల్‌లో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహం, పొత్తులు, జాతీయ భద్రత తదితర అంశాలపై చర్చించారు.
 
ఆ తర్వాత జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, ఇప్పుడు దేశంలోనూ, గుజరాత్‌లోనూ సిద్ధాంతాల మధ్య పోరాటం సాగుతోంది. అందుకే సీడబ్ల్యూసీ భేటీని గుజరాత్‌లో ఏర్పాటు చేశాం. ఓవైపు ద్వేషం ఉంది. ఇది గాడ్సేకు ప్రతిరూపం. మరోవైపు ప్రేమ ఉంది. ఇది మహాత్మ గాంధీకి, గుజరాత్‌ వారసత్వానికి ప్రతిరూపం. చివరికి, ప్రేమ, గాంధీజీ, సౌభ్రాతృత్వం, గుజరాత్‌, కాంగ్రెస్‌ పార్టీలదే విజయం’’ అని రాహుల్‌ అన్నారు.
 
సాధారణంగా తమకు ఏమైనా అన్యాయం జరిగితే ప్రజలు సుప్రీం కోర్టుకు వెళతారని, కానీ, చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులే మీడియాకు ఎక్కారని, తమ పని తమను చేసుకోనివ్వడం లేదని ఆరోపించారని గుర్తుచేశారు. ఎక్కడ చూసినా ద్వేషం నింపేస్తున్నారని, వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
 
గత ఎన్నికల్లో ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేస్తామని 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ హామీ ఇచ్చారని, వాటిని ఎక్కడ డిపాజిట్‌ చేశారని రాహుల్‌ ధ్వజమెత్తారు. ఇప్పటికీ వ్యాపారులు గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారని జీఎస్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పుల్వామా దాడి సూత్రధారి మసూద్‌ అజార్‌ను ప్రత్యేక విమానంలో పాకిస్థాన్‌కు ఎవరు పంపారని ప్రశ్నించారు. 
 
దేశంలో 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.50 లక్షల కోట్ల రుణాలను మోడీ మాఫీ చేశారు. కానీ, రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ అనేది తమ విధానమే కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారనీ రాహుల్ గుర్తుచేశారు. కాగితపు విమానం తయారు చేయడం కూడా చేతగాని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ఒప్పందాన్ని కట్టబెట్టారని రాహుల్ ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యనమలకు బలుపో... బద్ధకమో తెలియదు : తోట రాణి ఫైర్