కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఓ హిందువు అనేందుకు ఎలాంటి రుజువులు ఉన్నాయంటూ ఆయన ప్రశ్నించారు.
భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులపై రాహుల్ చేసిన విమర్శలపై ఆయన మాట్లాడుతూ, రాహుల్ పక్కా హైబ్రీడ్ వ్యక్తి.. ఒక ముస్లిం తండ్రి, క్రైస్తవ తల్లికి జన్మించిన వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు. తనకు తాను జంధ్యం ధరించిన హిందువునని ప్రకటించుకున్న ఈ ముస్లిం (రాహుల్).. తండ్రి ముస్లిం, తల్లి క్రైస్తవురాలు.. హిందువు అని రుజువు చేసుకునేందుకు ఈయన వద్ద ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు.
రాహుల్ తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు ఆయన శరీర భాగాలు చెల్లా చెదురయ్యాయి. ఆయన మృతదేహాన్ని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. అప్పుడు సోనియా కూడా డీఎన్‌ఏ పరీక్ష కోసం ప్రియాంక రక్త నమూనాలను తీసుకోవాలని చెప్పారు. రాహుల్‌ను వద్దని అన్నారు. ఇది రికార్డుల్లో ఉంది. ఇటువంటి హైబ్రీడ్ వ్యక్తి ఐఏఎఫ్ వైమానిక దాడులపై ఆధారాలు అడుగుతారా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.