''RX100'' సినిమా రికార్డుల పంట పండిస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలైన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల పరంగా పుంజుకుంది. ఈ బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్
''RX100'' సినిమా రికార్డుల పంట పండిస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలైన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల పరంగా పుంజుకుంది. ఈ బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్‌లకు మంచి క్రేజ్ లభిస్తోంది.
ఈ సినిమా తర్వాత పాయల్, కార్తీకేయలకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో రేర్ ఫీట్‌ను అందుకుంది. జులై 12న విడుదలైన ఈ సినిమా ఈరోజుకి 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని తన సత్తా చాటింది. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది.
నైజాంలో రూ.5 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ ఆరు థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అంతేగాకుండా ఆరెక్స్100 సినిమా త్వరలోనే తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో రీమేక్ అయ్యే ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించనున్నాడు.