Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RX 100 సినిమాను మీ అమ్మతో కలిసి చూస్తావా... డైరెక్టర్ షాక్

ఆర్ఎక్స్ 100. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యువప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. లిప్ లాక్ సీన్లతోనే సినిమా మొత్తం భారీ విజయాన్ని సాధించింది. అమ్మాయిలలో కొందరిని చెడ్డవాళ్ళుగా చిత్రీకరించిన ఈ సినిమాన

Advertiesment
RX 100 సినిమాను మీ అమ్మతో కలిసి చూస్తావా... డైరెక్టర్ షాక్
, బుధవారం, 1 ఆగస్టు 2018 (12:10 IST)
ఆర్ఎక్స్ 100. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యువప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. లిప్ లాక్ సీన్లతోనే సినిమా మొత్తం భారీ విజయాన్ని సాధించింది. అమ్మాయిలలో కొందరిని చెడ్డవాళ్ళుగా చిత్రీకరించిన ఈ సినిమాను యువకులు రెండుమూడుసార్లు చూశారు. డైరెక్టర్ అంచనాలను మించి సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. 
 
ఇంతకీ సినిమా డైరెక్టర్ కొత్త వ్యక్తి అజయ్ భూపతి. రాంగోపాల్ వర్మ శిష్యుడు. మొదటి సినిమాతోనే తెలుగు సినీపరిశ్రమలో చర్చకు తెరతీశారు అజయ్ భూపతి. ఈ సినిమా బ్లూఫిల్మ్ కన్నా అన్యాయంగా ఉందంటూ మహిళా సంఘాలు పెద్దఎత్తున గగ్గోలు పెట్టాయి. సినిమాను బ్యాన్ చేయాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళా సంఘాలు ఎంత రాద్దాంతం చేశాయో అంత హైప్ పెరిగి సినిమా కాస్త భారీ విజయాన్ని సాధించింది.
 
అయితే గత కొన్నిరోజుల ముందు డైరెక్టర్ అజయ్ భూపతి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని హియాయత్ నగర్ దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ మాల్ వద్దకు వెళ్ళారు. అప్పటివరకు తెలుగు ప్రజలకు అజయ్ భూపతి ఎవరో తెలియదు. కానీ ఒక్క సినిమాతో భూపతి బాగా ఫేమస్ అయిపోయారు. దీంతో ఆ షాపింగ్ మాల్‌లో యువకులు అజయ్ భూపతిని గుర్తించి కరచాలనం చేస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఇంతలో ఒక పెద్దావిడ అజయ్ భూపతి దగ్గరకు వచ్చి... నాయనా నువ్వు మీ అమ్మతో కలిసి ఆర్ఎక్స్ 100 సినిమాను చూస్తావా అని ప్రశ్నించింది. దీంతో డైరెక్టర్ షాకయ్యారు. అంతేకాదు పక్కనే ఉన్న యువకులు ఆశ్చర్యపోయి పెద్దావిడ ముఖంవైపు చూశారు.
 
తన మనవరాలితో కలిసి ఆర్ఎక్స్ 100 సినిమాకు వెళ్ళిన ఆ పెద్దావిడ సినిమా మొత్తం చూసి బాధపడుతూ బయటకు వచ్చేసిందట. సమాజానికి ఏం చెబుదామని డైరెక్టర్ ఈ సినిమా తీశారో అర్థంకాక పెద్దావిడ బాధపడ్డారట. డైరెక్టర్ కనిపిస్తే ఖచ్చితంగా కడిగెయ్యాలంటూ వెయిట్ చేశారట. అయితే ఆమెకు ఆ అవకాశం వచ్చింది. డైరెక్టర్ కనిపించడంతో తన ఆవేశాన్ని ఆపులేక అడిగేశారు. అయితే అజయ్ భూపతి మాత్రం కోపగించుకోకుండా పాత తరహా చిత్రాలు తీస్తే ఎవరు తీస్తారని.. కొత్త రకం సినిమా తీశానంటూ సమాధానమిచ్చి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందీలో అర్జున్ రెడ్డికి ముహుర్తం ఫిక్స్..!