కన్యాదానం చేసిన వాడే కామాంధుడయ్యాడు... ఎక్కడ?
సభ్యసమాజం తలదించుకునే మరో సంఘటన ఇది. తండ్రి తరువాత స్థానంలో ఉండే బాబాయ్ తన కోర్కె తీర్చమని వివాహితను వేధించాడు. బాబాయ్ వేధింపులు భరించలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరుకు చెందిన శరత్ కుమార్‌తో ఆమనికి ఆరేళ్ళ క్రితం వివాహమైంది. ఆమని తండ్రి అనారోగ్యంతో మరణించడంతో తండ్రి స్థానంలో ఆమె బాబాయ్ డి.వి.రావు దగ్గరుండి వివాహం చేయించాడు. కట్నం కింద ఆమనికి బాబాయ్ రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో ఆమనికి సహాయం చేశాడు డి.వి.రావు.
వివాహమై ఆరు సంవత్సరాలైంది. సజావుగానే వారి కాపురం సాగుతుండేది. అయితే డి.వి.రావు ఆమనిపై కన్నేశాడు. వివాహం సమయంలో తానిచ్చిన రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని, డబ్బులు లేకుంటే తన కోర్కె తీర్చాలని బెదిరించాడు. బాబాయ్ కాబట్టి విషయాన్ని బయటకు చెప్పకుండా ఆమని బాధను మనస్సులోనే ఉంచుకునేది.
కానీ బాబాయ్ నుంచి వేధింపులు ఎక్కువవడంతో భర్తకు ఒక లేఖ రాసి తన ఆత్మహత్యకు బాబాయే కారణమని, లైంగికంగా తనను వేధిస్తున్నాడని లేఖలో రాసి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమని మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డి.వి.రావు పరారీలో ఉన్నాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.