Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన ప్రియురాలు.. ఎక్కడ?

అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని నమ్మించి ప్రియురాలే హత్య చేసింది. తన శారీరక సుఖం కోసం ఇంటికి వచ్చిన ప్రియుడిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా

Advertiesment
ప్రియుడిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన ప్రియురాలు.. ఎక్కడ?
, సోమవారం, 30 జులై 2018 (11:08 IST)
అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని నమ్మించి ప్రియురాలే హత్య చేసింది. తన శారీరక సుఖం కోసం ఇంటికి వచ్చిన ప్రియుడిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలు ఇలా ఉన్నాయి. పొదిలికి చెందిన షేక్‌ షబ్బీర్‌ (32) మర్రిపూడి పోలీసుస్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇదే ప్రాంతానికి చెందిన ఇమాంబీ అనే మహిళతో పరిచయమైంది. ఈ పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి కొనకనమిట్ల మండలం చవటపల్లి, పేరారెడ్డిపల్లిలో ఉన్న కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల కోళ్ల ఫారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 
 
ఈ తరుణంలో రెండు రోజుల క్రితం కోళ్ల ఫారం నుంచి మంటలు రావడంతో స్థానికులు వెళ్లి ఇమాంబీని ప్రశ్నించారు. లోపలికి వెళ్లి చూడగా షబ్బీర్‌ కాలిపోయి మృతదేహమై కనిపించాడు. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చాయని ఇమాంబీ నమ్మించేందుకు ప్రయత్నించింది. 
 
హత్యా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... మృతదేహం ఉన్న తీరు చూస్తే కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్టుగా ఉందని నిర్ధారించారు. మృతుడి కాళ్లూ చేతులను గొలుసులతో మంచానికి కట్టేసి ఉన్నాయి. ఇమాంబీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ జైళ్ళలో 471 మంది భారతీయులు.. విడుదలకు మార్గమేది?