Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా "ఆదిపురుష్" సినిమా టిక్కెట్ల పంపిణీ.. నిజమా?

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:32 IST)
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్‌లు జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తిరుపతి వేదికగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం టిక్కెట్లను పది వేల మందికి ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఈ టిక్కెట్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
 
ఈ టిక్కెట్లను కావాలనుకునేవారు సెలెబ్రేటింగ్ 'ఆదిపురుష్' గూగుల్ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని, వివరాలు నమోదు చేసిన వారికి టిక్కెట్లు పంపిస్తామన్నారు. మరన్ని వివరాల కోసం 95050 34567 అనే మొబైల్ నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు కూడా ర్యాగింగ్‌తో సమానం : యూజీసీ

హైదరాబాద్‌లో విషాదం.. కల్తీ కల్లు సేవించి 15 మందికి అస్వస్థత

ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు.. ఎందుకని?

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments