Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల వృద్ధి కినారా క్యాపిటల్ ప్రణాళిక

Kinara
, మంగళవారం, 6 జూన్ 2023 (16:01 IST)
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు తోడ్పడుతున్న కినారా క్యాపిటల్, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌లలోని వేలాది MSMEలకు మద్దతు ఇచ్చే ప్రణాళికలతో తన పరిధిని మరింతగా పెంచుతున్నట్లు ప్రకటించింది. 2024 ఆర్ధిక సంవత్సరంలో  తనఖా లేని రీతిలో 800 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార రుణాలు అందించాలని ప్రణాళిక చేసింది. 2016లో ఫిన్‌టెక్ ఈ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుండి, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఎక్కువగా సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు కంపెనీ 20,000 కు పైగా వ్యాపార రుణాలను అందించింది. కినారా క్యాపిటల్ ఈ ప్రాంతాల నుండి FY22 నుండి FY23 వరకు 190% AUM వృద్ధిని నమోదు చేసింది.
 
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు (MSMEలు) మద్దతు ఇవ్వడం యొక్క ప్రభావం ఆదాయ ఉత్పత్తి మరియు ఉద్యోగ కల్పన కోసం కొత్త అవకాశాలతో బలమైన సంఘాలను నిర్మిస్తుంది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లోని MSMEలకు కినారా ఇప్పటి వరకు INR 1,200 కోట్లకు పైగా రుణాలను  పంపిణీ చేసింది, ఇది చిన్న వ్యాపార వ్యవస్థాపకులకు INR 36 కోట్లకు పైగా ఆదాయాన్ని పెంచడానికి దారితీసింది మరియు అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థల్లో 16,000 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లో, కినారా క్యాపిటల్ ఈ ప్రధాన MSME సబ్ సెక్టార్‌లలో : ఆహార ఉత్పత్తులు, నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రికల్స్, ఫ్యాబ్రికేషన్, చెక్క ఉత్పత్తులు, మెటల్ భాగాలు మరియు ఫ్యాషన్ లో అత్యధిక డిస్బర్సుమెంట్  మరియు వృద్ధిని సాధించింది.  తయారీ, వాణిజ్యం మరియు సేవల రంగాలలో వున్నా  MSME రంగాలలో 300 కంటే ఎక్కువ ఉప-రంగాలకు వ్యాపార రుణాలను  కినారా అందిస్తుంది.
 
తిరునావుక్కరసు ఆర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO), కినారా క్యాపిటల్ మాట్లాడుతూ...  “తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శ్రేయస్సు కోసం మా అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. మేము ఇక్కడ చూస్తున్న వ్యవస్థాపక నిబద్ధతతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మా వృద్ధిలో 20% ఈ ప్రాంతంలోని MSMEల నుండి వస్తుందని మేము ఆశిస్తున్నాము. మేము మా కస్టమర్‌ల వృద్ధిని పెంచడానికి తగిన ఆర్థిక పరిష్కారాలు మరియు వ్యక్తిగతీకరించిన కస్టమర్ సేవను అందించడం ద్వారా వారి విజయానికి కట్టుబడి వున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఎస్ డీఈఈ సెట్ ప్రిలిమినరీ కీ విడుదల