తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించిన డీఈఈ సెట్ ప్రిలిమినరీ కీ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీన ఈ పరీక్ష జరగ్గా 79.40 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం మొత్తం 6,485 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,144 మంది పరీక్ష రాసినట్టు డీఈఈ సెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి వెల్లడించారు.
తాజాగా అధికారులు ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల లోగా తెలపాలని విద్యార్థులకు సూచించారు. ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు చదవాల్సి ఉంటుంది.