హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైవుంది. దీనికితోడు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శనివారం గరిష్టంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోత, రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెల్సిందే.
ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం వాతావరణం కాస్త చల్లబడింది. ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాతవరణం కొద్దగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమైవుంది.