Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లక్ష్మీస్ ఎన్టీఆర్' అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. నిజంగా నిజమే గెలిచింది.. జై బాలయ్య

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (12:29 IST)
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యింది. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో భాగంగా.. పది నిమిషాల వ్యవధిలో ఓ మల్టీప్లెక్స్ లో 1000 టికెట్లు అమ్ముడు కావడాన్ని ప్రస్తావిస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.


'ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్‌‍ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు. అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య" అని వ్యాఖ్యానించారు. 
 
హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో హౌస్ ఫుల్ అయినట్టు చూపుతున్న థియేటర్ సీటింగ్ స్క్రీన్ షాట్‌ను ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో యాడ్ చేశారు. కాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత దివ్యవాణి నేతృత్వంలో దేవీబాబు, బ్రహ్మం చౌదరి తదితరులతో కూడిన టీడీపీ బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. 
 
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూసి ఓ నిర్ణయం తీసుకోవాలంటూ దివ్యవాణి ఈసీని కోరారు. ఈ సినిమా నిర్మాతలు వైసీపీకి చెందినవారేనని, ఈ చిత్రం వెనుక ఉన్నది కూడా వైసీపీయేనని ఆమె స్పష్టం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాకుండా చూడాలని, ఓ కమిటీ వేసి ఆ సినిమాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments