Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాడిదే తప్పంటే ఎలా? ఇద్దరు వ్యక్తుల గొడవను పబ్లిక్ చేస్తారా?

కాబిల్ చిత్రంలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన యామీ గౌతమ్.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కాకుండా హృతిక్‌కు పరోక్షంగా సపోర్ట్ చేసింది. వ్యక్తిగత విషయాన్ని సామాజిక వివాదంగా మార్చవద్దని యామీ గౌతమి మనవి చేసుకుంది. ఇద్దరికీ తాను మద్దతివ్వట్లేదని స్పష్టం చేస

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (12:35 IST)
కాబిల్ చిత్రంలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన యామీ గౌతమ్.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కాకుండా హృతిక్‌కు పరోక్షంగా సపోర్ట్ చేసింది. వ్యక్తిగత విషయాన్ని సామాజిక వివాదంగా మార్చవద్దని యామీ గౌతమి మనవి చేసుకుంది. ఇద్దరికీ తాను మద్దతివ్వట్లేదని స్పష్టం చేసింది. మగాడిదే తప్పు అనడం సబబు కాదని యామీ వెల్లడించింది. 
 
బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్‌, న‌టి కంగ‌నా ర‌నౌత్‌ల మ‌ధ్య వివాదం ఇంకా కొలిక్కి రాని నేపథ్యంలో, యామీ గౌత‌మ్ త‌న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. చరిత్ర ఆధారంగా మగాడిదే తప్పు అనడం ఎంతవరకు సబబు అని  ప్రశ్నించింది. ఇలా చేస్తే లింగ స‌మాన‌త్వం కోసం చేస్తున్న పోరాటం త‌ప్పుదోవ ప‌డుతుంద‌ని సూచించారు.

ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య విషయాన్ని సామాజిక అంశంగా మార్చొద్ద‌ని యామీ గౌతమ్ స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖుల వివాదం తన స్పందించేలా చేసిందని.. వారిలో ఒకరితో  కలిసి పనిచేశానన్నారు. 
 
అలాగ‌ని అత‌నికి మ‌ద్ద‌తుగా నేను మాట్లాడటం లేదు. ఒక మ‌హిళ‌గా స్పందిస్తున్నాను. కేవలం మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్ప‌టికే స‌మాజం అత‌న్ని నేరస్థుడిగా ఖ‌రారు చేసింది. ఈ పోస్ట్ ద్వారా నేను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు. ఎవ‌రినీ కించప‌ర‌చ‌డం లేదు. ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య గొడ‌వ‌ను సామాజిక వివాదంగా మార్చొద్ద‌ని మాత్ర‌మే వేడుకుంటున్నానని... ఈ వివాదంలో నిజమెంతో తెలిసే వరకు వేచి చూడాల్సిందనని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments