మెగా ఫ్యామిలీకి బ్రో సెంటిమెంట్‌ అవుతుందా!

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (07:40 IST)
Chiranjeevi
మెగాస్టార్‌ చిరంజీవి తమిళంలోని వినోదం సిత్తమే చిత్రం చూశాక బ్రో పేరుతో తెలుగులో రీమేక్‌ చేయాలని దర్శకుడు సముద్రఖని అనుకున్నాక ఆయన కొన్ని మార్పులు చేశారు. ఇక పవన్‌కళ్యాణ్‌ టైం దేవుడుగా నటించగా మార్కండేయ పాత్రను సాయితేజ్‌ నటించాడు. మొదట ఆ పేరు చిరంజీవి అని పెట్టాలనుకున్నారు. కానీ ఫైనల్‌గా మార్కండేయగా పెట్టమని చిరంజీవే డిసైడ్‌ చేశాడు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక డివైడ్‌ టాక్‌ రావడంతో యూత్‌కు పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. అందుకే సాయితేజ అండ్‌ టీమ్‌తో ప్రచారాన్ని ఊరుఊరా చేస్తున్నారు. ఇదిలా వుండగా, బ్రో పేరుతో మరో సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి చేయనున్నాడని తెలుస్తోంది.
 
మలయాళంలో బ్రోడాడీ పేరుతో వున్న సినిమాను చిరంజీవి రీమేక్‌ చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాలన్నీ రీమేక్‌లే. అయితే ఇందులో కొద్దిగా మార్పులు చేసి తీయనున్నారని ఫిలింనగర్‌ కథనాలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్‌ వర్షన్‌లో ఇద్దరు హీరోలు. వారు తండ్రీ కొడుకులుగా నటించారు. కానీ చిరంజీవి సూచన మేరకు అన్నదమ్ములుగా మార్చాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రీపొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో దీనిపై పూర్తి సమాచారం రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దక్షిణ తీర కొత్త రైల్వే జోన్‌... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్

పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి

పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ

అదృశ్యమైన 11 గంటల్లోనే నాలుగేళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments