Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌ ఎలా ఉందంటే.. రివ్యూ

కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌ ఎలా ఉందంటే.. రివ్యూ
Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (07:23 IST)
Krishnagadu ante oka range
నటీనటులు: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, ర‌ఘు, స్వాతి పొలిచ‌ర్ల‌, సుజాత‌, విన‌య్ మ‌హ‌దేవ్ త‌దిత‌రులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: ఎస్ కె రఫీ, సంగీతం: సాబు వర్గీస్,  ఎడిటర్‌: సాయి బాబు తలారి, నిర్మాతలు: పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, దర్శకత్వం: రాజేష్‌ దొండపాటి, నిర్మాణ సంస్థ: శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి.
 
ఈ శుక్రవారం ఆగస్టు 4న పలు కొత్త సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌. గ్రామీణ నేపథ్యంలో సాగిన లవ్, యాక్షన్ సినిమా. ఎప్పుడో వందేమాతరం సినిమా తీసిన గ్రామంలో ఈ సినిమా తీశామని దర్శకుడు రాజేష్‌ దొండపాటి తెలిపారు. గొర్రెల కాపరి యువకుడి కథే ఈ సినిమా అని నిర్మాత తెలిపారు. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
 
కథ:
కృష్ణ (రిష్వి తిమ్మరాజు) చిన్నతనంలోనే తన తండ్రి స్వంత ఇల్లు కట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ హటాత్తుగా తండ్రి మరణించడంతో తల్లి పెంపకంలో పెరుగుతాడు. యువకుడు అయ్యాక ఊరిలోనే తన మేనమామ సాయంతో మేకలు కాస్తూ ఉంటాడు. ఎప్పటికైనా తండ్రి కోరిక అయిన ఇంటిని పూర్తి చేయాలనేది కృష్ణ లక్ష్యం. ఇదిలా ఉండగా తన మరదలు సత్య (విస్మయ) ను కృష్ణ పెళ్లి చేసుకోవాలనేంత ఇష్టం. సాఫీగా సాగుతున్న వీరి ప్రేమకు అదే గ్రామానికి చెందిన ఓ ధనవంతుడు దేవా బ్రేక్ లా అడ్డుపడుతుంటాడు.  సత్య ను పొందేందుకు కృష్ణని అవమానిస్తాడు దేవ. దాన్ని సవాల్ గా తీసుకుని తన స్వంత ఇల్లు మూడు నెలల్లో పూర్తి చేసి,సత్యను పెళ్లి చేసుకుంటానని సవాల్‌ చేస్తాడు కృష్ణ. కానీ అదే టైములో  తన తల్లికి క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అప్పు కోసం సిటీకి వెళతాడు. అక్కడ బీహార్ బాచ్ ఎటాక్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
ఇందులో అంతా కొత్త వారు నటించారు. కథ గ్రామంలో జగగడంతో విజువల్ గా బాగుంది. మేకల కాపరిగా హీరోని పరిచయం కావడం అప్పుడెప్పుడో నాగేస్వరరావు తర్వాత పెద్దగా లేదనే చెప్పాలి. ఇప్పటి జనరేషన్ కు కొత్తగా అనిపిస్తుంది.  కృష్ణ, సత్యల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌ మొత్తం సత్య, కృష్ణల ప్రేమ చుట్టే తిరుగుతుంది.
 
సెకండాఫ్‌ లో కథ చెప్పాలి కాబట్టి ఎమోషనల్‌గా సాగుతూనే ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతుంది. కానీ కొన్ని సీన్స్ ఆలా వచ్చి పోతుంటాయి. ఇక్కడ ఎడిటింగ్ లోపం కనిపిస్తుంది. వీధి రౌడీ మర్డర్‌ వెనుక ఎవరున్నారనేది తెలియకపోవడం, కృష్ణ డబ్బులను బీహార్ ముఠా దొంగిలించడం..ఇలా ప్రతీ సీన్‌ కొంత ఆసక్తికరంగా సాగుతుంది. దోపిడీ ముఠాను హీరో కనిపెట్టిన తీరు బాగుంటుంది. క్లైమాక్స్‌లో హీరో  కొత్త వాడైనా ఎమోషన్స్‌ని రాబట్టుకున్నాడు దర్శకుడు.
 
మేకల కాపరి కృష్ణగా రిష్వి తిమ్మరాజు చక్కగా నటించాడు. లుక్స్ బాగున్నాయి. కొద్దిగా నటన మెరుగు పరిస్తే మరింత రాణిస్తాడు. చలాకీగా  సత్యగా విస్మయ తనదైన నటనతో ఆకట్టుకుంది. లుక్స్‌ పరంగా తెరపై కాస్త బొద్దుగా కనిపించినా, అందంగా ఉంది. దేవాగా చేసిన నటుడు పాత్రకు న్యాయం చేశాడు.స్వాతి పొలిచ‌ర్ల‌, సుజాత‌, విన‌య్ మ‌హ‌దేవ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పల్లెటూరు కనుక కెమెరా పనితనం బావుంది. కొన్ని చోట్ల దర్శకుడు మరింతగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి.  నేపథ్య సంగీతం పర్వాలేదు. కొత్త వారైనా నిర్మాణ విలువలు తగ్గట్టుగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలో వినోదం మరింతగా ఉంటే ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేసేవారు.
రేటింగ్ : 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments