Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో నరేశ్‌కు బెంగుళూరు కోర్టులో ఊరట - మూడో భార్య ఇంటికి రావడానికి వీల్లేదు...

Advertiesment
Dr. Naresh V.K
, బుధవారం, 2 ఆగస్టు 2023 (15:59 IST)
సీనియర్ నటుడు నరేశ్‌కు బెంగుళూరులోని సిటీ సివిల్ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన నటించిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇటీవల ఆయన మూడో భార్య రమ్య రఘుపతి వేసిన దావాను కోర్టు కొట్టేసింది. ఇరు పక్షాలవాదనలను ఆలకించిన న్యాయస్థానం, మెరిట్‌ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తాజాగా తీర్పును వెలువరించింది. సెన్సార్‌ బోర్డు చెప్పినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు పేర్కొంది. అలాగే, సెన్సార్ బోర్డు ఒక చిత్రాన్ని కల్పితమని సర్టిఫై చేస్తే దాని విడుదలను ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకునే ప్రసక్తే లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
 
మరోవైపు, నరేశ్‌ కుటుంబానికి చెందిన మరో కేసులోను కోర్టు ఈరోజు ఉత్తర్వులిచ్చింది. నరేశ్‌కు చెందిన నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి రమ్యరఘుపతి రాకుండా చూడాలని ఆయన కుటుంబసభ్యులు గతంలో కోర్టులో దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. నరేశ్‌ ఇంట్లోకి ఆమె రాకూడదంటూ  ఆదేశాలు జారీ చేసింది. కాగా, నరేశ్‌, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలోనే ఆయన నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండా.. వేరే మహిళతో నరేశ్‌ ఎలా సన్నిహితంగా ఉంటారంటూ గతంలో రమ్య మీడియా ముందుకు వచ్చారు. ‘మళ్ళీ పెళ్లి’లో తమ వ్యక్తిగత జీవితాన్ని.. ముఖ్యంగా తనను టార్గెట్‌ చేశారని ఇటీవల ఆమెను కోర్టును ఆశ్రయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరేష్ ఇంటికి రాకుండా రమ్య రఘుపతిపై నిషేధం విధించిన సిటీ సివిల్ కోర్టు