బెంగుళూరు హోటల్‌లో చిరు - వివివి ... వీరిద్దరికి అక్కడేంపని?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:39 IST)
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి - టాలీవుడ్ దర్శకుడు వివి. వినాయక్‌లు బెంగుళూరులోని ఓ హోటల్‌లో కలుసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లో ఉండాల్సిన వీరిద్దరూ అక్కడకెళ్ళి ఏం చేస్తున్నారనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. దీనిపై ఆరా తీస్తే... 
 
ప్రస్తుతం చిరంజీవి నటించే 152వ చిత్రం 'ఆచార్య' సెట్స్‌పై వుంది. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌లో నటించనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఈ చిత్రానికి దర్శకుడుగా సుజిత్ పేరును ఎంపిక చేసి, తెలుగు నెటివిటీకి అనుగుణంగా కథను మార్చే పనులు అప్పగించారు. దీంతో ఆయన ఆ పనిలో నిమగ్నమై తుది డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయగా, దాన్ని చూసిన చిరంజీవి రిజెక్ట్ చేసినట్టు సమాచారం. పైగా, దర్శకుడిగా సుజిత్‌ను తొలగించి వివి. వినాయక్‌కు అప్పగించినట్టు వినికిడి. 
 
మెగా రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబ‌ర్ 150'ను ప్రేక్ష‌కాభిమానులు మెచ్చేలా తెర‌కెక్కించిన ఘ‌న‌త వినాయ‌క్‌కే ద‌క్కుతుంది. దీంతో చిరుచూపు వినాయ‌క్‌పై ప‌డింది. అన్న‌య్య అజ్ఞ మేర‌కు వినాయ‌క్ 'లూసిఫ‌ర్' స్క్రిప్ట్‌ను ప్రిపేర్ చేశారట‌. 
 
రీసెంట్‌గా బెంగళూరు వెళ్లి చిరంజీవిని కలిసి స్క్రిప్టు వినిపించారట. మెగాస్టార్‌కు కూడా స్క్రిప్ట్ న‌చ్చింద‌ట‌.. దాదాపు లూసిఫ‌ర్ రీమేక్‌ను వినాయ్ తెర‌కెక్కించ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు హ‌ల్ చేస్తున్నాయి నెట్టింట‌. మ‌రి మెగా క్యాంప్ ఈ వ్య‌వ‌హారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments