Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ లూసీఫర్ స్ర్కిప్ట్ రెడీ, సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

Advertiesment
Megastar chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూవీ ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే... చిరంజీవి ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మెహర్ రమేష్‌తో ఓ సినిమా చేయనున్నాను. అలాగే బాబీతో ఓ సినిమా చేస్తాను. సాహో సుజిత్ ఓ సినిమా చేస్తానని ప్రకటించారు.
 
అయితే... సుజిత్‌తో లూసీఫర్ రీమేక్ చేయాలి అనుకున్నారు కానీ.. సుజిత్ లూసీఫర్ రీమేక్‌లో చేసిన మార్పులు చేర్పులు నచ్చకపోవడంతో ఆ కథను తెరకెక్కించే బాధ్యత వినాయక్ అప్పగించారు.
 
 వినాయక్... లూసీఫర్ రీమేక్‌లో చేసిన మార్పులుచేర్పులు చిరంజీవికి నచ్చి ఓకే చెప్పారట. రీసెంట్ స్ర్కిప్ట్ ఫైనల్ నెరేషన్ పూర్తి అయ్యింది.
 
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ సమర్పణలో ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తారు. బాబీతో సినిమా, మెహర్ రమేష్‌‌తో సినిమాలు ఉన్నప్పటికీ వీరద్దరి కంటే ముందుగా వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే... 2021 సమ్మర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు.. ఇద్దరు అరెస్ట్.. వాళ్లెవరంటే?