Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి కాబోతున్న అర్జున్ రెడ్డి?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:16 IST)
అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రతి చిత్రంలో వేరియేషన్ కలిగి ఉన్న పాత్రలు చేస్తూ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంలో మరెవరూ నటించలేరు అన్న రీతిలో నటించాడు. గతేడాది మూడు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
 
అందులో గీత గోవిందం వంద కోట్ల మార్క్ వసూళ్లు సాధించిన చిత్రంగా విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ద్విభాష చిత్రంగా వచ్చిన 'నోట' ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా చిత్రం కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్నే సాధించింది. 
 
తాజాగా విజయ్ దేవరకొండ భరత్‌ కమ్మ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఇసాబెల్లా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్‌లు విజయ్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో విజయ్ ఎనిమిదళ్ల పిల్లాడికి తండ్రిగా కనిపించబోతున్నాడట. వయస్సుకు మించిన పాత్రను పోషిస్తున్నాడని వినికిడి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో చిత్రం తెరకెక్కుతోంది. గీత గోవిందంతో మ్యూజికల్ హిట్ ఇచ్చిన సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments