Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్ 3 కోసం వెంకీ డిమాండ్, షాక్ తిన్న దిల్ రాజు, ఏమైంది?

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (14:02 IST)
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ఎఫ్ 2. ఈ సినిమాకి సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఇచ్చిన విజయోత్సాహంతో ఈ సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 సినిమా చేయాలనుకోవడం తెలిసిందే. 
 
అయితే.. ఈ సీక్వెల్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో కూడా నటిస్తున్నారని... ఈ పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజని సంప్రదించారని టాక్ వచ్చింది.
 
 అయితే.. రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీ చేస్తున్నారు. మలినేని గోపీచంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన క్రాక్ టీజర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. అలాగే మరో రెండు సినిమాల కథా చర్చలు జరుగుతున్నాయి. 
 
ఇలా రవితేజ వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో ఎఫ్ 3లో నటించేందుకు నో చెప్పారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో నటించేందుకు వెంకటేష్‌ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని.. అందుచేతనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం లేటు అవుతుందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.
 
 ఈ విషయమై వెంకటేష్, సురేష్ బాబు, దిల్ రాజుల మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ గురించి తాజా వార్త ఏంటంటే... వెంకీ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో వెంకీ చేయాల్సిన పాత్రను దిల్ రాజు రవితేజతో చేయించాలనుకుంటున్నారని.. ఈ విషయమై రవితేజతో చర్చించారని ప్రచారం జరుగుతుంది. 
 
మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం ఆ పాత్రను వెంకటేషే చేయాలని పట్టుబడుతున్నారని.. అందుకనే ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అవుతుందని టాక్. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
 
 అయితే.. ఈ వార్త బయటకు వచ్చినప్పుడు మహేష్ బాబు ఏంటి... ఎఫ్ 3 సినిమాలో నటించడం ఏంటి ఇదేదో గాసిప్ అనుకున్నారు. వాస్తవం ఏంటంటే...  మహేష్ బాబుని ఎఫ్ 3 సినిమాలో నటించమని సంప్రదించిన మాట వాస్తవమే అని తెలిసింది. కానీ.. మహేష్ చిరు మూవీలో నటిస్తుండటంతో నో చెప్పారని టాక్. 
 
ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి - నిర్మాత దిల్ రాజు వెంకీ అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడమా..? లేక వెంకీ పాత్రను వేరే హీరోతో చేయించడమా..? అనే విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం. మరి.. ప్రచారంలో ఉన్నట్టు వెంకీ పాత్రను రవితేజతో చేయిస్తారా..? లేదా..? అనేది త్వరలోనే తెలియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments