మహేష్‌ బాబు డైరెక్టర్ ఆఖరికి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:55 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు కెరీర్లో మరిచిపోలేని సినిమాల్లో మహర్షి ఒకటి. ఈ సినిమా మహేష్‌ బాబు 25వ చిత్రం. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ మూవీకి మహేష్ బాబుకి కమర్షియల్ సక్సెస్ అందించడంతో పాటు మంచి పేరు కూడా తీసుకువచ్చింది. దీంతో వంశీ పైడిపల్లితో మహేష్ మరో సినిమా చేయాలనుకున్నారు.
 
కథ రెడీ చేసుకో మళ్లీ కలిసి సినిమా చేద్దాం అన్నారు మహేష్‌. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా ఎనౌన్స్ చేస్తారనుకున్నారు. అయితే... వంశీ చెప్పిన కథ నచ్చకపోవడంతో మహేష్ పరశురామ్‌తో సినిమాని ఎనౌన్స్ చేసాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుకున్నారు.
 
ఇటీవల చరణ్‌కి కథ చెప్పారు కానీ... అక్కడ కూడా స్టోరీ సరిగా లేకపోవడం వలన ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దీంతో వంశీ పైడిపల్లి మళ్లీ మహేష్‌ చెంతకే వెళ్లారట. మళ్లీ మహేష్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారట. అయితే... ఈసారి చేసేది సినిమా కాదు. వెబ్ సిరీస్ అని సమాచారం. అది కూడా మహేష్‌ బాబుతో కాదండోయ్ .. మహేష్ బ్యానర్లో వంశీ పైడిపల్లి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
 
ఈ వెబ్ సిరీస్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తాడట. మొత్తానికి మహర్షి అనే బ్లాక్‌బస్టర్ సాధించినా... వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఆఖరికి వంశీ పైడిపల్లి సినిమా ఎవరితో సెట్ అవుతుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ISRO: డిసెంబర్ 15న 6.5 టన్నుల బ్లూబర్డ్-6 ఉపగ్రహ ప్రయోగం

సంగారెడ్డి పరువు కేసు.. యువతి నాలుగు నెలల గర్భవతి.. అడ్డు రావడంతో దెబ్బలు పడ్డాయ్

మారనున్న అమరావతి రూపు రేఖలు.. లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, రాజ్‌‌భవన్ నిర్మాణం

కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు... టేక్ హోమ్ శాలరీలో కోత?

పెళ్లైన 3 రోజులకే విడాకులు కోరిన వధువు, కారణం ఇదేనంటూ ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments