చిరు - త్రిష కలిసి నటించనున్నారా? ఇంతకీ ఏ సినిమాలో?

Webdunia
శనివారం, 16 మే 2020 (19:29 IST)
మెగాస్టార్ చిరంజీవి - త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ చిరు - త్రిష కలిసి నటించలేదు. ఆచార్య సినిమాలో చిరు సరసన త్రిష నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. త్రిషపై షూటింగ్ ప్లాన్ చేస్తుంటే... సడన్‌గా ఆచార్య సినిమాలో నటించడం లేదు అంటూ త్రిష షాక్ ఇచ్చింది. 
 
ప్రేక్షకులతో పాటు ఆచార్య టీమ్‌కి కూడా ఇది పెద్ద షాక్. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. క్రియేటీవ్ డిఫరెన్స్ వలన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు త్రిష ప్రకటించింది. అయితే.. చిరంజీవి మాత్రం మణిరత్నం సినిమాలో నటించడం కోసం ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడం వలనే త్రిష ఆచార్య నుంచి తప్పుకుందన్నారు. 
 
ఇటీవల త్రిష పుట్టినరోజు నాడు చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. దీనికి త్రిష కూడా స్పందించి చిరంజీవికి థ్యాంక్స్ తెలియచేసింది. తాజా వార్త ఏంటంటే... చిరు - త్రిష కలిసి నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో అంటే... ఆచార్యలో మాత్రం కాదు.
 
 ఆచార్య తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత మెహర్ రమేష్‌ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నారు. ఈ మూడింటిలో ఏదో ఒక సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించడం ఖాయం అంటున్నారు. మరి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments