చిరు కోసం కథ రెడీ చేస్తున్న చరణ్‌ డైరెక్టర్

Webdunia
శనివారం, 16 మే 2020 (15:18 IST)
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ-ఎంట్రి ఇచ్చిన తర్వాత ఆచితూచి కాస్త స్లోగా సినిమాలు చేస్తారు అనుకున్నారు కానీ.. చిరు అలా కాకుండా మరింతగా స్పీడు పెంచి దూసుకెళుతున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన రామ్ చరణ్‌ నిర్మించారు. 
 
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. 
ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కూడా రామ్ చరణ్‌ నిర్మిస్తున్నారు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థతో కలిసి. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయడం కోసం మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్వయంగా చిరంజీవి తెలియచేసారు. 
 
తాజా వార్త ఏంటంటే.... చరణ్‌‌తో రచ్చ సినిమాని తెరకెక్కించిన సంపత్ నంది చిరంజీవి కోసం పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. రజాకార్ల నేపథ్యంలో స్టోరీ రెడీ చేస్తున్నాడని.. ఈ కథ ఖచ్చితంగా చిరంజీవికి నచ్చుతుందనే నమ్మకంతో సంపత్ నంది ఉన్నారని.. త్వరలోనే చిరుకు ఈ కథను చెప్పనున్నారని సమాచారం.
 
 మరి.. ఇప్పటికే మూడు కథలకు ఓకే చెప్పిన చిరు సంపత్ నంది స్టోరీకి ఓకే చెబుతారో లేక నో చెబుతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments