Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ భామే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు! (video)

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:57 IST)
తెలుగులో ఒకటి, రెండు చిత్రాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ముఖ్యంగా, రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. కానీ, చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కియారా సూపర్బ్ రోల్ చేసింది. పైగా, మూవీ సూపర్ హిట్ కావడంతో కియారాకు మంచి పేరు కూడా వచ్చింది. మంచి అందంతో పాటు.. అభినయం ప్రదర్శించింది. 
 
ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీబిజీ తారగా మారిన కియారా.. టాలీవుడ్‌లో మంచి అవకాశం వస్తే చేయాలని చూస్తుంది కానీ.. అస్సలు ఆమెకు అంత టైమ్ ఇవ్వడం లేదు బాలీవుడ్. అయితే ఎలాగైనా ఆమెను టాలీవుడ్‌లోకి తీసుకురావాలని మన స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు.  
 
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌తో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. చరణ్ సరసన ఎట్టి పరిస్థితుల్లోనూ కియారాను తీసుకు రావాలని కొరటాల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
అలాగే మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు కూడా ఫస్ట్ చాయిస్ కియారానే అనుకున్నారు. మొత్తంగా చూస్తే.. కియారాను టాలీవుడ్‌కు రప్పించాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని చెప్పవచ్చు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments