Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కీర్తి సురేష్‌తో పాటు కుర్ర హీరోయిన్‌పై మనసుపడిన 'ప్రిన్స్'? (video)

Advertiesment
Sarkaru Vaari Paata
, గురువారం, 6 ఆగస్టు 2020 (11:09 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. వరుస హిట్లతో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత ఈ హీరో నటించనున్న చిత్రం పేరు సర్కారువారి పాట. గీతగోవిందం దర్శకుడు పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పరశురాం... ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్‌ని కూడా విడుదల చేశారు. 
 
ఇకపోతే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరును ఖరారు చేశారు. మహేష్‌తో ఈమె నటించడం ఇదేతొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం స్వయంగా ఆమె తెలిపింది. 'సర్కారు వారి పాట'లో హీరోయిన్‌గా చేస్తున్నానంటూ ఆమె తెలపడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. 
 
అంతేకాదు 'సర్కారువారి పాట'లో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇవి నిజమోకాదో తెలియకముందే.. సర్కారు వారి పాటలో రెండో హీరోయిన్ ఈమెనంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. ఆమె ఎవరో కాదు. అనన్య పాండే. 
 
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఫైటర్ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్న హీరోయిన్. అనన్యను ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటింపజేసేందుకు పరశురాం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడగానే ఆమెకు కథ వినిపించాలని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెట్‌లో మాత్రం మహేష్ సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్ అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ ఒక్క హీరోతోనూ పడక పంచుకోలేదు : బాలీవుడ్ నటి