Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ 'పుష్ప'లో విలన్‌గా తమిళ హీరో!!

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (15:36 IST)
'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ - 'లెక్కలు మాస్టారు' కె.సుకుమార్ కాంబినేషన్‌లోరానున్న చిత్రం "పుష్ప". రష్మిక మందన్నా హీరోయిన్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 
 
ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. 
 
ఈ క్రమంలో మరో తమిళనటుడు బాబీ సింహ విలన్‌గా నటించనున్నారన్న గుసగుసలు వినిపించాయి. తాజాగా తమిళ హీరో ఆర్య ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారన్న గుసగుసలు తాజాగా వినిపిస్తున్నాయి. అయితే 'పుష్ప'లో ఆర్య విలన్‌గా నటించనున్నారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 
 
ఇదిలావుండగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'వరుడు' సినిమాలో ఆర్య విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పలు డబ్బింగ్ సినిమాలతో 'ఆర్య' తెలుగు ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుతం 'పుష్ప' సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments