Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి అల్లుడుకి మరో ఛాన్స్...

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (14:56 IST)
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌నులో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6కి పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. 
 
హైదరాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని తుల‌సి వ‌నం శ్రీవెంక‌టేశ్వ‌ర దైవస‌న్నిధానంలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్‌టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
'విజేత' వంటి క్లాసిక్ హిట్ అందుక‌ని ప్ర‌స్తుతం సూప‌ర్ మచ్చి అనే క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్న క‌ళ్యాణ్ దేవ్ నుంచి మూడో సినిమాగా ఎస్.ఆర్.టి ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 రాబోతుంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. 
 
గ‌తంలో సాయితేజ్ 'క‌ల్కి' వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే 'ఛ‌లో', 'భీష్మ' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్‌కి సంబంధించిన‌ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే పూర్తి చేసుకొని సెట్స్ మీద‌కు సినిమాను తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
దీపావ‌ళి కానుకగా నవంబ‌రు 14న ఉద‌యం 10గంల‌కు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లుగా నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల, యువ ద‌ర్శ‌కులు ప్ర‌ణీత్, వేణు ఉడుగ‌ల ముఖ్య అతిధులుగా విచ్చేసి, చిత్ర బృందానికి శుభాభినంద‌న‌లు తెలిపారు. 
 
రామ్ త‌ళ్లూరి ప్రొడ‌క్ష‌న్, బ్యానర్ - ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్, స‌మ‌ర్ప‌ణ - సాయిరిషిక‌, నిర్మాత - రజ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌, క‌థ, క‌థ‌నం - దేశ్ రాజ్ సాయితేజ్, సంగీతం - మ‌హతి సాగ‌ర్, సినిమాటోగ్రాఫర్ - సురేశ్ ర‌ఘుతు, ఎడిటింగ్ - అన్వ‌ర్ అలీ, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ -  శ్రీ నాగేంద్ర తంగ‌ల‌, సౌండ్ డిజైన్ - సింక్ సినిమా, ద‌ర్శ‌కుడు - ర‌మ‌ణ తేజ‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments