Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కడా తగ్గేది లేదంటున్న కొరటాల

Advertiesment
ఎక్కడా తగ్గేది లేదంటున్న కొరటాల
, బుధవారం, 11 నవంబరు 2020 (12:02 IST)
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేయాలని కథ రెడీ చేసుకున్నాడు. చిరును కథతో మెప్పించాడు. అయితే... ఏ ముహుర్తాన ఈ సినిమా స్టార్ట్ చేసాడో కానీ... ఆచార్యకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్‌ను 
ఈ నెలలో స్టార్ట్ చేయాలి అనుకున్నాడు.
 
ఇంతలో చిరంజీవి తనకు కరోనా వచ్చిందని.. ఇటీవల తనని కలిసినవాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోండి అని సోషల్ మీడియా ద్వారా తెలియచేసి షాక్ ఇచ్చారు. 
 
దీంతో కొరటాల షాక్ అయ్యారు. అయితే... నిన్నటి నుంచి ఆచార్య షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. చిరంజీవి కరోనా అని ప్రకటించడంతో ఆచార్య షూటింగ్‌కి బ్రేక్ పడుతుంది అనుకున్నారు కానీ.. కొరటాల మాత్రం తగ్గేది లేదు అంటూ ఆచార్య షూటింగ్ స్టార్ట్ చేసారు.
 
చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించారు. 2021 సమ్మర్లో ఆచార్యను ఎట్టి పరిస్థితుల్లోను రిలీజ్ చేయాల్సిందే అని పట్టుదలతో కొరటాల వర్క్ చేస్తున్నారు. ఇందులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో చరణ్ కూడా ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
 
 మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ సరసన హాట్ యాంకర్ అనసూయ