Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ వెళ్లింది షూటింగ్ కా..? ఫ్యామిలీ ట్రిప్ కా..? (video)

Advertiesment
మహేష్ వెళ్లింది షూటింగ్ కా..? ఫ్యామిలీ ట్రిప్ కా..? (video)
, సోమవారం, 9 నవంబరు 2020 (13:51 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు తాజా చిత్రం "సర్కారు వారి పాట". ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందా..? అని ఎదురు చూస్తున్నారు. 
 
అయితే... కరోనా రావడం వలన షూటింగ్ ఆగింది. ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలో చేయాలి. కరోనా వలన అమెరికాలో షూటింగ్ చేయడం కుదరదేమో అక్కడ షూట్ చేయాల్సిన సీన్స్ అన్నీ ఇండియాలోనే షూట్ చేసేలా ప్లాన్ చేయడం కూడా జరిగింది.
 
కానీ, చివరకు అమెరికాలోనే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ పరశురామ్ అమెరికా వెళ్లి లోకేషన్స్ ఫైనల్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మహేష్‌ బాబు తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లారు. మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్ - సితార వెళ్లారు. ఆదివారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యారు. 
 
కొవిడ్ టైమ్‌లో ముఖాలకు మాస్క్‌లు వేసుకోవడంతో పాటు అన్ని జాగ్రత్తలతో వారు విదేశాలకు వెళ్లారు. 
 
అయితే... మహేష్ వెళ్లింది షూటింగ్ కా..? లేక ఫ్యామిలీ ట్రిప్ కా..? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అసలు విషయం ఏంటంటే... డిసెంబర్ లేదా జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. ఈలోపు ఫ్యామిలీతో ట్రిప్ వేయనున్నారని తెలిసింది. 
 
గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయిన మహేష్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ... లైఫ్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇక ముందుకు సాగడమే అన్నారు. ఇందులో మహేష్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. వచ్చే సంవత్సరం 'సర్కారు వారి పాట' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 కోట్లు ఇస్తానంటే "పఠాన్‌" కోసం పని చేస్తానంటున్న హీరోయిన్! (video)