Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తృప్తి ఇప్పుడు లభిస్తోంది.. తమన్నా

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (19:56 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అప్పుడే 13 యేళ్ళు అయిపోయింది. అప్పుడెప్పుడో హ్యాపీడేస్ సినిమాతో శేఖర్ కమ్ముల దర్సకత్వంలో నటించిన ఆమెకు ఆ తరువాత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆచితూచి ఆమె సినిమాలు చేస్తూనే వచ్చారు. ఎన్నో సినిమాలు భారీ విజయాన్ని సాధించి పెట్టాయి. ఆమెను మరింత ముందుకు తీసుకెళ్ళాయి.
 
అయితే మొదట్లో తనకు అనుకున్నన్ని అవకాశాలు రాలేదని.. తన క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా తక్కువగా ఉండేదని.. ప్రత్యేక గీతాలకే ఎక్కువ అవకాశాలు వచ్చిన సందర్బాలు వున్నాయని వాపోతోంది తమన్నా. కానీ ఇప్పుడు అలా కాదు. అవకాశాలు తనంతట అవే రావడంతో పాటు హీరోకు సరైన జోడిగా మంచి క్యారెక్టర్లు లభిస్తున్నాయి. 
 
దర్సకులు ఆవిధంగా నాకు మంచి అవకాశాలనే ఇస్తున్నారు. ఇదంతా తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. మొదట్లో సినీపరిశ్రమలో పెద్ద సంతృప్తి లేకపోయినా ఇప్పుడు లభిస్తున్న తృప్తి నాకు చాలా బాగుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రత్యేక గీతం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
 
ప్రత్యేక గీతంలో నటిస్తున్నాము.. ఇక అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకుని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. అలా ఎప్పుడూ అనుకోకండి.. ఆ సినిమాలో ఆ పాటకు నేను సరిపోతానని అనుకున్నారు. అందుకే నన్ను అడిగారు. నేను ఒకే అన్నాను. అందులోను ఎఫ్‌..2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన చెప్పగానే నేను ఏ మాత్రం ఆలోచించలేదు. ఒకే అనేశానని చెబుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments