ఎఫ్-3లో తమన్నా.. బాలయ్యకు నో చెప్పింది అందుకేనా?

ఆదివారం, 5 జనవరి 2020 (15:41 IST)
ఎఫ్-2 సినిమా నుంచి తమన్నా కెరీర్ మళ్లీ ఊపందుకుంది. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవితో భారీ సినిమా చేసిన ఆమెకి తాజాగా బాలకృష్ణ సరసన చేసే ఛాన్స్ లభించింది. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం తమన్నాను అడిగారట. 
 
అయితే ఈ ఆఫర్‌ను తమన్నా సున్నితంగా తిరస్కరించినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలకృష్ణ సినిమాకి నో చెప్పేంత బిజీగా అయితే తమన్నా లేదు. మరి బాలయ్య సరసన నటించేందుకు తమన్నా ఎందుకు నో చెప్పిందోనని ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా, ఎఫ్-3లో తమన్నా నటించనుందని టాక్ వస్తోంది. అందుకే బాలయ్య సరసన నటించేందుకు ఒప్పుకోలేదని సమాచారం. 
 
ఇకపోతే.. ఎఫ్‌3 సీక్వెల్ కోసం ఇప్ప‌టికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ కాగా, అనిల్ రావిపూడి కొన్ని స్క్రిప్ట్స్ వినిపించారు. వాటిలో ఏ కథను సీక్వెల్ చేయాలో అర్ధం కావ‌డం లేదు. ఇక లీడ్ రోల్స్ తాను, వరుణ్ చేస్తామని, హీరోయిన్లను కూడా ఫైనల్ చేయాల్సి వుందని వెంకటేష్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బన్నీ అల వైకుంఠపురంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?